చందనం, ఎర్రచందనం వంటి ఖరీదైన కలప రకాలు మనకు తెలుసు. వాటన్నింటినీ మించిన కలప ఇది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర బంగారం కంటే ఎక్కువే! ఇది 'అగర్వుడ్'.
ఇటీవలి కాలంలో నరికివేత కారణంగా అగరువృక్షాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చందనం సహా మిగిలిన రకాల కలపను ఘనపుటడుగుల చొప్పున విక్రయిస్తే, అగరు కలపను మాత్రం కిలోల లెక్కన విక్రయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో అగరు కలప కిలో ధర లక్ష డాలర్లకు (రూ.83 లక్షలు) పైమాటే!
చందనం, ఎర్రచందనం వంటి ఖరీదైన కలప రకాలు మనకు తెలుసు. వాటన్నింటినీ మించిన కలప ఇది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర బంగారం కంటే ఎక్కువే! ఇది 'అగర్వుడ్'.
అంటే, అగరు కలప. ఉత్తరభారత దేశంలో దీనినే 'ఔద్' అని అంటారు. ఈ కలప నుంచి వెలువడే జిగురును అగరొత్తులు, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. భారత్, చైనా, శ్రీలంక, ఇండోనేసియా, మలేసియా, లావోస్, కంబోడియా, థాయ్లాండ్, పాపువా న్యూగినీ దేశాల్లోని దట్టమైన అడవుల్లో అగరు వృక్షాలు కనిపిస్తాయి.
© 2025 - Pariwar Infra Projects