Police Officer Sucess Story: పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..తెల్లచెందనం పంటతో కోట్లకు కోట్లు..
Police Officer Sucess Story: ఐఏస్, ఐపీఎస్ ఇలా గొప్ప పదవులలో కొలువులు సంపాదించి మంచి గుర్తింపు పొందినవారిని చూసి ఉంటాం ..కానీ గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం అతనిని ప్రపంచం అంతా గుర్తించే విధంగా చేసింది.
ఇంతకు అతను చేసిన పని ఎంటి? తనను విజయం దిశగా నడిపించిన రహస్యం ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాద్రి బజార్ గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన అవినాష్ కుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ ఇవాళ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. తెల్లచందనం పెంపకమే అతని విజయానికి సీక్రెట్‌గా నిలిచిందంటే నమ్ముతారా?. దీని కోసం తన పోలీస్ ఉద్యోగం సైతం మానేసి తెల్లచందనం సాగు చేయడం ప్రారంభించాడు. అయితే ఇలా ఎందుకు చేశారు. అవినాష్‌కు లాభం వరించిందా అంటే..నూటికి నూరు శాతం లభింస్తుందనే సమాధానం చెబుతున్నాడు.
1998లో పోలీసు ఉద్యోగంలో చేరిన అవినాష్ కుమార్ యాదవ్ 2005లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం వ్యవసాయంపై దృష్టి పెట్టారు. కేవలం 5 మొక్కలతో వ్యవసాయం ప్రారంభించిన అవినాష్ ఇవాళ 10 రాష్ట్రాల్లో 50 ఎకరాలలో తెల్లచందనాని సాగు చేస్తున్నారు. ఈ సాగుతో కోట్లాది రూపాయాల ఆదాయం రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆలోచన ఇంతకు ఎలా వచ్చింది?
2012లో తెల్లచందనం సాగు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు అవినాష్. ముందు తన పొలంలో 5 నుంచి 7 మొక్కలను నాటగా.. ఈ మొక్కలు చాలా వేగంగా పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో లాభాలను పొందవచ్చని అనుకున్నారు. అనంతరం కర్ణాటక నుంచి 50 తెల్లచందనం మొక్కలను తెప్పించారు.
చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు దేశంలోని 80 వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, 25 వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అవినాష్ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ఎకరాల్లో తెల్లచందనం సాగు చేస్తున్నారు. ఈ తెల్ల చందనం చెట్టు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత కనీసం 1 లక్ష రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Your Future Starts Here: Find Your Perfect Address Today!
Get in Touch© 2024 - Pariwar Infra Projects